రేపు ఢిల్లీకి చంద్రబాబు... ఎన్డీయే సమావేశానికి హాజరు!

  • ఈ సాయంత్రం ఎన్టీఆర్ భవన్ కు విచ్చేసిన చంద్రబాబు
  • పసుపు మయంగా మారిన టీడీపీ కేంద్ర కార్యాలయం
  • చంద్రబాబు రాకతో నినాదాలతో మార్మోగిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. ఈ ఉదయం నుంచే కోలాహలంగా మారిన టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్... ఈ సాయంత్రం చంద్రబాబు రాకతో పసుపు జాతరను తలపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మార్మోగిపోయింది. కాగా, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.

Chandrababu

More Telugu News